ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నగదు లేక ఏటీఎంలు వెలవెల..! - ఎస్ బి ఐ ఎటిఎం మూసివేసిన దృశ్యం.

చిత్తూరు జిల్లా పీలేరులోని ఏటీఎం కేంద్రాలు నగదు లేక వెలవెలబోతున్నాయి. కొన్నింట్లో నో క్యాష్ బోర్డు పెట్టగా... మరికొన్ని మూసివేశారు. సంబంధిత అధికారులు స్పందించి ఏటీఎంలలో నగదు సౌకర్యం కల్పించాలని ఖాతాదారులు కోరుతున్నారు.

chittor district
కలికిరి పట్టణంలోని బరోడా బ్యాంక్ ఏటీఎం కేంద్రంలో నో క్యాష్ బోర్డు పెట్టిన దృశ్యం

By

Published : May 8, 2020, 6:43 PM IST

చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో ఏటీఎం కేంద్రాలు నగదు లేక వెలవెలబోతున్నాయి. వారం రోజులుగా ఏటీఎం కేంద్రాల్లో నగదు లేకపోవడంతో మూసివేశారు. తిరుపతి నుంచి రావలసిన నగదు గూడ్స్ వాహనాలను పోలీసులు అనుమతించకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

మార్గమధ్యలోని రంగంపేట, చిన్నగొట్టిగల్లు గ్రామాలు కోవిడ్-19 రెడ్ జోన్ పరిధిలో ఉండటం కారణంగా ప్రధాన రహదారులపై వాహనాలను పోలీసులు అనుమతించలేదు. సంబంధిత అధికారులు స్పందించి ఏటీఎంలలో నగదు సౌకర్యం కల్పించాలని ఖాతాదారులు కోరుతున్నారు.

ఇది చదవండి 'అధైర్యం వద్దు.. అండగా ఉంటాం'

ABOUT THE AUTHOR

...view details