ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేపటి నుంచి విష్ణు నివాసం కొవిడ్ కేర్ సెంటర్​లో అడ్మిషన్లు రద్దు

చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా వినియోగిస్తున్న తితిదే సత్రాలను ఖాళీ చేసి తితిదేకు అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

no admissions
no admissions

By

Published : Oct 17, 2020, 10:26 PM IST

తిరుపతి నగరాభివృద్ధి సంస్థ సమావేశ మందిరంలో కొవిడ్‌కేర్‌ సెంటర్లలో వైద్యసేవలు, తుడా సమస్యలపై తుడా ఛైర్మన్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డితో కలిసి కలెక్టర్‌ ఎన్‌.భరత్‌గుప్తా సమీక్ష నిర్వహించారు. తిరుపతి నగరంలోని విష్ణునివాసం, గోవిందరాజస్వామి 2, 3 సత్రాలను తితిదేకు అప్పగించనున్నట్లు కలెక్టర్‌ ప్రకటించారు. జిల్లాలో కొవిడ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టినందున తితిదే 2, 3 సత్రాలలో వున్న సిబ్బందికి డిప్యుటేషన్‌ రద్దు చేసి పూర్వస్థానాలకు పంపాలని ఆదేశించారు.

ఆదివారం నుంచి విష్ణు నివాసంలో అడ్మిషన్లు నిలిపేయాలని.. ఇప్పటికే అక్కడ వున్న రోగులను డిశ్చార్జ్ చేసే వరకు ఉంచి.. మరో 10 రోజుల్లో పూర్తి స్థాయిలో ఖాళీ చేసి తితిదేకు అప్పగించాలని ఆదేశించారు. రుయా ఆసుపత్రిలో 460, శ్రీనివాసంలో 400, విష్ణు నివాసంలో 300, మాధవంలో 50 మంది కరోనా రోగులు వున్నారని కలెక్టర్‌ తెలిపారు. శ్రీనివాసం వసతి గృహంలో 1200 మంది చికిత్స పొందడానికి సరిపడా సౌకర్యాలు ఉండగా.. కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా మార్చారు. ఇప్పుడు తిరిగి అప్పగించేందుకు చర్యలు చేపట్టారు.

సమీక్షా సమావేశంలో పాల్గొన్న తుడా ఛైర్మన్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి.. తుడా పరిధిలోని మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించడానికి అవసరమైన భూములను సేకరించాలని జిల్లా కలెక్టర్​ను కోరారు. పేదల ఇళ్ల పట్టాలకు సంబంధించి భూ సేకరణ పూర్తిచేసి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని.. ఇదే తరహాలో మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో తుడా లేఔట్లు వేయడానికి ప్రణాళిక రూపొందించినట్లు తుడా ఛైర్మన్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. సమీక్షలో తుడా వీసీ హరికృష్ణ, సెక్రటరీ లక్ష్మి , రుయా సూపరెండెటెంట్‌ భారతి, అదనపు డీ.ఎం.హెచ్.ఓ. అరుణ సులోచనా దేవి, ఆరోగ్యశ్రీ కోయార్డినేటర్ బాలాంజనేయులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

వరదల నుంచి కోలుకోకముందే హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం

ABOUT THE AUTHOR

...view details