భూమన కరుణాకర్ రెడ్డి.. వైకాపాకు చిత్తూరు జిల్లాలో సీనియర్ నేత. 2004లో తిరుపతి ఎమ్మెల్యేగా, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్‌గా పనిచేశారు. అధికారానికి దూరమై దశాబ్దం గడుస్తున్నా.. ఎన్నికలు వచ్చాయంటే ఎగిరి గంతేస్తారు. ఎవరైనా ఆయన దగ్గరకు వెళ్లి కరచాలనం చేసిందే పాపం. ఇష్టం ఉన్నా లేకున్నా మెడలో కండువా వేయటం.. వారితో కలిసి ఫోటోలు దిగటం క్షణాల్లో జరిగిపోతాయి. ఇక్కడితో భూమన స్క్రీన్‌ప్లే అయిపోదు. వైకాపాలో భారీగా చేరికలు అంటూ మరుసటి రోజు పత్రికలోకలర్ ఫొటోలు దర్శనమిస్తాయి. అంతే.. ఇక అవాక్కవటం ఆ ఫొటోల్లో ఇరుక్కుపోయినప్రజల వంతవుతుంది.
ఫోటో దిగితే.. జెండా మారింది
తెదేపా తరపున ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వారిలో తుడా ఛైర్మన్ నరసింహయాదవ్ ఒకరు. టికెట్ దక్కకపోవటంతో ఓ సమయంలో ఆయన పూర్తి నిరాశకు లోనయ్యారు. స్వయంగా చంద్రబాబు నచ్చజెప్పటంతో తెదేపా అభ్యర్థి సుగుణమ్మకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రచారంలో భాగంగా నరసింహయాదవ్ మేనల్లుడు రాజా యాదవ్‌ను కలిశారు. నమస్కారం చేసిన కరుణాకర్‌రెడ్డికి తిరిగి ప్రతినమస్కారం చేయగా... దగ్గరకు తీసుకుని ఫోటో దిగారు. ఒక్కసారిగా పార్టీ కండువా సైతం కప్పారు. తర్వాతి రోజు ఉదయాన్నే ఓ పత్రికలో భూమన ఆధ్వర్వంలో పార్టీలో చేరిన తుడా ఛైర్మన్ మేనల్లుడు అని ప్రచురించారు. పేపర్లో వచ్చిన ఫోటోలు చూసి బాధితులు అయోమయానికి గురయ్యారు.