ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నీట మునిగిన తిరుపతి.. ఎమ్మెల్యే సహాయక చర్యలు

By

Published : Nov 26, 2020, 6:04 PM IST

తిరుపతిలో తుపాను ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ తిరుమలలో కురిసిన వర్షాలతో తిరుపతిలోని ప్రధాన వర్షపు నీటి కాలువలు పొంగిపొర్లుతున్నాయి. పరిస్థితి తెలుసుకున్న ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు.

mla karunakar reddy visited rain effected areas
నీట మునిగిన తిరుపతి ఎమ్మెల్యే సహాయక చర్యలు

తిరుమల కొండల్లో కురిసిన భారీ వర్షాలకు తిరుపతిలోని మార్వాడి గుండం, కపిలతీర్థం జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తిరుపతిలో తుపాను ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ తిరుమలలో కురిసిన వర్షాలతో తిరుపతిలోని ప్రధాన వర్షపు నీటి కాలువలు పొంగిపొర్లుతున్నాయి. వర్షపు నీటి కాలువలు ఆక్రమణకు గురి కావటంతో కాలువ పరిసరాల్లో ఉన్న ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. సామర్థ్యానికి మించి నీరు ప్రవహిస్తుండటంతో నీరు అంతా రోడ్ల పై ప్రవహిస్తుండటం.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితి తెలుసుకొన్న తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలుగా గుర్తించిన కాలనీల్లో అధికారులు గస్తీ ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ABOUT THE AUTHOR

...view details