ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Ninth Class Student Ramya Suicide Video Viral : టీచర్ వేధిస్తున్నాడని విద్యార్థిని ఆత్మహత్య.. వైరల్ అవుతున్న సూసైడ్ నోట్, వీడియో - ఏపీ క్రైం న్యూస్

Ninth Class Student Ramya Suicide Video Viral: ప్రతి ఒక్కరి పాఠశాల జీవితంగా చాలా ఆనందంగా.. అల్లరితో.. ఉల్లాసంగా సాగిపోతుంది. విద్యార్థులు తప్పు చేస్తే ఉపాధ్యాయులు దండిస్తుంటారు. కానీ ఓ ఉపాధ్యాయుడు, విద్యార్థి కలిసి.. కులం పేరుతో దూషించావంటూ ఓ విద్యార్థిని వేధించారు. మనోవేదనకు గురైన బాలిక ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం బాలిక రికార్డ్ చేసిన వీడియో, లేఖ వైరల్ అవుతున్నాయి.

ninth_class_student_ramya_suicide_video_viral
ninth_class_student_ramya_suicide_video_viral

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2023, 7:06 PM IST

Ninth Class Student Ramya Suicide Video Viral : తరగతి గదిలో అల్లరి చేస్తున్న ఓ విద్యార్ధిని క్రమశిక్షణతో మెలగాలని చెప్పడమే తప్పు అయ్యింది. ఇద్దరు విద్యార్థులకు సర్దిచెప్పి వారిని గాడిలో పెట్టాల్సిన ఉపాధ్యాయుడు చిన్నారి విషయంలో కఠినంగా వ్యవహరించారు. ఆమె అన్న మాటలను భూతద్దంలో చూపి ప్రార్ధనా సమయంలో ప్రధానోపాధ్యాయులు, తోటి విద్యార్థుల ఎదుట చెప్పి చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. అంతే మనస్థాపానికి గురైన బాలిక.. ఇంట్లో ఉరేసుకుని (Class IX Ramya Student Commits Suicide) బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తల్లిదండ్రులకు ఫోన్.. మనోవేదనకు గురైన బాలిక : ఈ నెల 20వ తేదీన బాలిక ఆత్మహత్య చేసుకోగా ఆమె రాసినసూసైడ్ నోట్(Student Ramya Suicide Letter Viral), మరణానికి ముందు రికార్డు చేసిన వీడియో తాజాగా శుక్రవారం వెలుగు చూశాయి. కుప్పం మండలం నూలకుంట జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎస్.రమ్య (13) తొమ్మిదో తరగతి చదువుతుంది. క్లాస్ లీడర్​గా వ్యవహరిస్తోన్న రమ్మ.. కొన్ని రోజుల క్రితం ఓ విద్యార్ధి అల్లరి చేయడాన్ని చూసి తప్పని చెప్పగా, ఆ విషయం ప్రదానోపాధ్యాయుడి వరకూ వెళ్లింది. ఆయన బెంగళూరులో కూలి పనులు చేసుకుంటున్న బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేయడంతో ఆమె మనోవేదనకు గురైంది. ఇటీవల మరో విద్యార్థి అల్లరి చేయగా, రమ్య కొట్టింది.

Medico Student Suicide in Guntur వైద్యుడు కావల్సినోడు.. శవంగా మారాడు..! మెడికో ఆత్మహత్యకు ఫీజు పెంపు కారణమా?

కులం పేరుతో విద్యార్థిని దూషించావంటూ ఉపాధ్యాయుడి వేధింపులు :ఈ విషయం ఓ ఉపాధ్యాయుడి దృష్టికి వెళ్లడంతో ఆయన రమ్యను మందలించారు. తాజాగా తరగతి గదిలో గొడవ చేస్తున్న ఒకరిని పద్ధతిగా ఉండాలని చెప్పింది. ఈ మాటలు విన్న ఆ ఉపాధ్యాయుడు.. సదరు విద్యార్థిని కులం పేరుతో దూషించావంటూ వేధించారు. ఆ విషయాన్ని అందరికి చెబుతాననడంతో తాను ఏ తప్పూ చేయలేదని, అల్లరి చేస్తున్న బాలుడిని దారిలో పెట్టేందుకే అలా మాట్లాడానని ఎంత చెప్పినా సదరు ఉపాధ్యాయుడు వినిపించుకోలేదు. అందరి ముందు చర్యలు తీసుకుంటానని చెప్పడంతో మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి ఉరేసుకుంది.

student suicide: కళాశాల భవనంపై నుంచి దూకి ఇంటర్​ విద్యార్థి ఆత్మహత్య

" పరువు పోతుందనే చనిపోతున్నా :నేను ఏ తప్పు చేశానో తెలియదు. ఒకసారి నేను ఎవరినో ఒక మాట అన్నందుకు హేఎం వరకు తీసుకెళ్లారు. మా అమ్మ నాన్నకు కాల్ చేసి నా గురించి చెప్పారు. క్లాస్​లో అందరి ముందు తన పరువు పోతుందనే చనిపోతున్నానని, తనకు ఇష్టమైన టీచర్లు రవి, సునీత, కమల, ఆంజనేయులు, జగన్నాథం, శివశంకర్, హెచ్ఎం సారు ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని వేడుకుంది. దశరథన్ సార్ నన్ను ఎంత తిట్టినా కొట్టినా ఇష్టమేనని ఆ లేఖలో రాసి ఉంది. అలాగే సారీ అమ్మా నాన్నా.. సారీ టీచర్.. నేను చనిపోతున్నా" అంటూ వీడియో రికార్డ్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో, (Student Selfie Suicide Video) లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

చదువుల తల్లిని చంపేశారా.. వైకాపా నేత కూతురి కోసం దారుణం!?

ABOUT THE AUTHOR

...view details