ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సచివాలయ వ్యవస్థతో 500 రకాల సేవలు అందుతాయి' - ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి

సచివాలయ వ్యవస్థ ద్వారా ఎన్నో సేవలు తక్కువ ధరకే అందుతాయని జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం గోపిదిన్నెలో నూతన గ్రామ సచివాలయ భవనాన్ని వారు ప్రారంభించారు.

new village secretariat building started in gopidinne chittore district
మాట్లాడుతున్న జేసీ వీరబ్రహ్మం

By

Published : Jun 15, 2020, 3:46 PM IST

Updated : Jun 15, 2020, 4:18 PM IST

గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు వివిధ రకాలు సేవలు అందుతాయని.. చిత్తూరు జేసీ వీరబ్రహ్మం అన్నారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డితో కలిసి గోపిదిన్నెలో గ్రామ సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. భవన నిర్మాణంలో స్థానిక వైకాపా నాయకుల సహకారం ఎంతో ఉందన్నారు.

ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఇక ఇక్కడ ఫ్యాక్షనిజానికి తావు లేదని..., ఆదర్శవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. హంద్రీనీవా నీటితో నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు.

Last Updated : Jun 15, 2020, 4:18 PM IST

ABOUT THE AUTHOR

...view details