చిత్తూరు జిల్లా పలమనేరు మండలం గొబ్బిళ్ళ కోటూరు గ్రామంలో... శనివారం రాత్రి విద్యుదాఘాతంతో గున్న ఏనుగు మృతి చెందింది. 3 సంవత్సరాల వయసులో చనిపోయిన బిడ్డ చుట్టూ...తల్లి ఏనుగు తిరుగుతున్న దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టించాయి. కడుపుకోతతో ఆదివారం రాత్రి బయలుదేరిన తల్లి ఏనుగు... తన బిడ్డ చావుకి కారణమైన ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభాన్ని నాశనం చేసింది. అక్కడే ఉన్న అటవీశాఖ సిబ్బంది ఏనుగును తరిమేందుకు ప్రయత్నించారు. అది ససేమిరా కదలలేదు సరికదా... తనకు తోడుగా మరో ఏనుగును తెచ్చుకుని అరుస్తూ విద్యుత్ సామగ్రిని ధ్వంసం చేసి అడవిలోకి వెళ్లిపోయింది.
తల్లడిల్లిన తల్లిహృదయం.. కడుపుకోతతో బీభత్సం - విద్యుదాఘాతం
కంటికి రెప్పలా చూసుకునే బిడ్డకు ఏమైనా అయితే తల్లి అల్లాడిపోతుంది. మనుష్యులుకైనా, జంతువులకైనా మాతృ ప్రేమ ఒక్కటే కదా! అలాంటిదే...జరిగింది. తన బిడ్డ కోసం ఏకంగా ట్రాన్స్ఫార్మర్నే ధ్వంసం చేసింది..
విద్యుదాఘాతంతో గురైన బిడ్డ చుట్టూ తిరుగుతున్న తల్లి