చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి రోగులు రావడానికి భయపడుతున్నారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం రోగులకు శాపంగా మారింది. గత మూడు రోజులకు ముందు కరోనా అనుమానితులకు పరీక్షలు చేశారు. వారిలో చాలామందికి పాజిటివ్ వచ్చి క్వారంటైన్ కి వెళ్లారు. వారి కోసం వాడిన పీపీఈ కిట్లను వైద్యులు ఆసుపత్రి ఆవరణలోనే పడేశారు. దీంతో ఈ సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లడానికి భయపడుతున్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి కొత్త రోగాలు తెచ్చుకోవడం కన్నా ఉన్న.. రోగంతో బాధ పడటం మేలని భావిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి..... కిట్లను తొలగించి ఆ ప్రాంతంలో శానిటేషన్ చేయించాలని ప్రజలు కోరుతున్నారు.
నారావారిపల్లిలో సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యం
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యం రోగులను ఇబ్బంది పాలు చేస్తోంది. ఆసుపత్రి ఆవరణలో పీపీఈ కిట్లు దర్శనమివ్వడంతో ఆసుపత్రికి వెళ్లేవారు భయపడుతున్నారు.
నారావారిపల్లిలో సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యం
ఇదీచూడండి.ఈ రామ భక్తులు.. రామదాసుకేం తీసిపోరు!