ఎన్సీసీ తెలుగురాష్ట్రాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్ఎన్రెడ్డి తిరుపతిలోని కళాశాలలు వార్షిక తనిఖీలు చేశారు. ఎన్సీసీ కోసం కళాశాలలు అందిస్తున్న వసతులపై ఆరాతీశారు. కళాశాలలు, పాఠశాలల్లో ఎన్సీసీ కోసం వసతులను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులను దేశసేవ వైపు మొగ్గు చూపేలా చేయటంలో ఎన్సీసీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. ప్రత్యేకించి ప్రైవేటు కళాశాలల్లో ఎన్ సీసీ కోసం ప్రత్యేక విభాగాలు ఉండటం లేదన్నారు. ఇందుకోసం ప్రభుత్వం స్థలాలను కేటాయించి వసతులను మెరుగు పర్చాలని కోరారు.
ఎన్సీసీ కోసం వసతులు మెరుగుపడాలి - facilities
కళాశాలలు, పాఠశాలల్లో ఎన్సీసీ కోసం వసతులను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని తెలుగు రాష్ట్రాల ఎన్ సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్ఎన్ రెడ్డి తెలిపారు.
ఎన్సీసీ