ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్​ జాగ్రత్తలు మరచి.. భారీ కృతజ్ఞతా ర్యాలీ! - విడ్ ప్రోటాకాల్​ను విస్మరించిన తిరుపతి ర్యాలీ

సీఎం జన్మదినం సందర్భంగా తిరుపతిలో శాసనసభ్యుడు భూమన కరుణాకరరెడ్డి నిర్వహించిన కృతజ్ఞతా ర్యాలీలో.. కొవిడ్ ప్రోటోకాల్​ను విస్మరించారు. వేల సంఖ్యలో మహిళా సంఘాల సభ్యులు, కార్యకర్తలను ర్యాలీకి తరలించారు. పోలీసులు పట్టించుకోకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

no covid safety measures
కొవిడ్​ జాగ్రత్తలు మరచి భారీ కృతజ్ఞతా ర్యాలీ

By

Published : Dec 21, 2020, 4:29 PM IST

సీఎం జన్మదినం సందర్భంగా నవరత్న పథకాలను ప్రవేశపెట్టినందుకు మహిళా సంఘాలు, కార్యకర్తల ఆధ్వర్యంలో.. తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకరరెడ్డి భారీగా కృతజ్ఞతా ర్యాలీని నిర్వహించారు. తిరుపతి నగరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కొవిడ్ ప్రోటోకాల్​ను విస్మరించారు. వేలసంఖ్యలో మహిళా సంఘాల సభ్యులను, కార్యకర్తలను ర్యాలీకి తరలించారు. కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యుల మధ్య కనీస దూరం లేకుండా వేలాది మంది.. కృష్ణాపురం ఠాణా నుంచి గాంధీరోడ్, తిలక్ రోడ్ మీదుగా, తుడా కార్యాలయం వరకూ ర్యాలీ చేశారు.

ఇంత జరగుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. తుడా కార్యాలయం వద్ద కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన భూమన కరుణాకరరెడ్డి.. పేద ప్రజల అభ్యున్నతి కోసం ఇచ్చిన మాట తప్పకుండా నవరత్నాల పథకాలను అమలు చేసిన సీఎం వైఎస్ జగన్... చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. వైఎస్ జగన్ లాగా రెండు పేజీల మ్యానిఫెస్టోతో ప్రజలను అభివృద్ధి పథంవైపు నడిపించిన ముఖ్యమంత్రి చరిత్రలో మరొకరు లేరంటూ ప్రశంసించారు.

ABOUT THE AUTHOR

...view details