రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ వాదనలు వినేందుకు ఎన్‌జీటీ అంగీకారం తెలిపింది. కేసు రీ-ఓపెన్ చేయాలన్న దరఖాస్తును ఎన్‌జీటీ చెన్నై ధర్మాసనం అనుమతించింది. ఇప్పటికే తెలంగాణ వాసి శ్రీనివాస్ వేసిన పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వ తాజా దరఖాస్తుతో తీర్పు వాయిదా వేసింది. అభ్యంతరాలు చెప్పేందుకు సమయం సరిపోలేదని తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులో పేర్కొంది. తమ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని గతంలో అఫిడవిట్ వేసింది. దీనిపై తదుపరి విచారణ ఈనెల 28కి జస్టిస్ రామకృష్ణనన్ నేతృత్వంలోని ధర్మాసనం వాయిదా వేసింది.
సీమ ఎత్తిపోతలపై తెలంగాణ వాదన వినేందుకు ఎన్‌జీటీ అంగీకారం - రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ అభ్యంతరం
రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ వాదనలు వినేందుకు ఎన్‌జీటీ అంగీకారం తెలిపింది. కేసు రీ-ఓపెన్ చేయాలన్న దరఖాస్తును అనుమతించింది. దీనిపై తదుపరి విచారణ ఈనెల 28కి జస్టిస్ రామకృష్ణనన్ నేతృత్వంలోని ధర్మాసనం వాయిదా వేసింది.
రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ వాదనలు వినేందుకు ఎన్‌జీటీ అంగీకారం