రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెదేపా కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి విమర్శించారు. పంచాయతీల్లో ఏకగ్రీవాలు కాకుండా కమిషనర్ అడ్డుపడే మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గ్రామాల అభివృద్ధి కోసమే ప్రభుత్వం ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తోందన్నారు. ఇంత ఏకపక్షంగా వ్యవహరించిన ఎన్నికల కమిషనర్‌ను దేశంలో మరెక్కడా చూడలేదని నారాయణ స్వామి ఆక్షేపించారు.
'నిమ్మగడ్డ లాంటి ఎస్ఈసీని దేశంలో మరెక్కడా చూడలేదు' - నారాయణ స్వామి తాజా వార్తలు
గ్రామాల అభివృద్ధి కోసమే ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తోందని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి స్పష్టం చేశారు. ఏకగ్రీవాలు కాకుండా ఎస్ఈసీ అడ్డుపడే మాటలు మాట్లాడుతున్నారని ఆక్షేపించారు.
నిమ్మగడ్డ లాంటి ఎస్ఈసీని దేశంలో మరెక్కడా చూడలేదు