NARA LOKESH YUVAGALAM PADAYATRA : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఎనిమిదో రోజు చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. పలమనేరులో పూర్తైన పాదయాత్ర.. పూతలపట్టు నియోజకవర్గం నుంచి ప్రారంభమయ్యింది. మొగిలి నుంచి పాదయాత్ర ప్రారంభించే ముందు "సెల్ఫీ విత్ లోకేశ్" కార్యక్రమం నిర్వహించారు. లోకేశ్‌ను కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు కలిసి సెల్ఫీలు దిగారు. అనంతరం స్వయంభు శ్రీ మొగిలేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన మొగిలి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభించారు.
ఎనిమిదో రోజు నారా లోకేశ్ యువగళం పాదయాత్ర.. మొగిలేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు - శ్రీ మొగిలేశ్వరస్వామి దేవస్థానం
NARA LOKESH YUVAGALAM PADAYATRA : చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఎనిమిదో రోజు కొనసాగుతోంది.
NARA LOKESH YUVAGALAM PADAYATRA