ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయి: నారా లోకేశ్

Nara Lokesh Yuvagalam: చిత్తూరు జిల్లాలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 15వ రోజూ ఉత్సాహంగా సాగింది. గంగాధర నెల్లూరు నియోజకవర్గం శ్రీరంగరాజపురం మండలం రాణిపురం వద్ద లోకేశ్‍ నాగలి పట్టి పొలం దున్నారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. వైసీపీ పాలనలో దళితులపై దాడులు ఎక్కువయ్యాయని లోకేశ్ విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 10లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని వెల్లడించారు.

Nara Lokesh Yuvagalam
నారా లోకేశ్

By

Published : Feb 10, 2023, 8:00 PM IST

15వ రోజూ యువగళం పాదయాత్రలో నారా లోకేశ్

Nara Lokesh 15th day Yuvagalam Padayatra: జగన్‌ పాలనలో జే ట్యాక్స్‌కు భయపడి పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు పక్కరాష్ట్రాలకు పారిపోతున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‍ ఆరోపించారు. 15వ రోజూ యువగళం పాదయాత్ర కొనసాగించిన లోకేశ్.. దారి పొడవుగా జనంతో మమేకమవుతూ ముందుకు సాగారు. రాణిపురం వద్ద నాగలి పట్టి పొలం దున్నారు. వైసీపీ కక్ష సాధింపునకు అమరరాజా పరిశ్రమ తరలిపోయిందన్నారు. దీని వల్ల రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని వ్యాఖ్యానించారు.

లోకేశ్ యువగళం పాదయాత్ర 15వ రోజూ ఊత్సాహంగా సాగింది. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం రేణుకాపురం నుంచి ప్రారంభమైన యాత్రలో.. యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం శ్రీరంగరాజపురం మండలం రాణిపురం వద్ద లోకేశ్‍.. నాగలి పట్టి పొలం దున్నారు. అనంతరం రైతులతో మాట్లాడి.. వారి సమస్యలను తెలుసుకున్నారు.

జిల్లాలో అమరరాజా పరిశ్రమ వెళ్లిపోవడం వల్ల దాదాపు 20 వేల మంది రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురంలో జాకీ పరిశ్రమను కూడా అక్కడ ఎమ్మెల్యే కమీషన్ల కోసం ఒత్తిడి చేసి తరిమేశారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 10లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని విమర్శించారు. సొంత ప్రయోజనాలు, అవినీతి సొమ్ము కోసం జగన్ రాష్ట్ర ప్రయోజనాలు, యువత భవిష్యత్తును బలి పెట్టారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే రీబిల్డ్ ఏపీ పేరుతో రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని చెప్పారు.

వైసీపీ పాలనలో దళితులపై దాడులు ఎక్కువయ్యాయి. దేశంలో ఎక్కడా ఎస్సీలపై అట్రాసిటీ కేసులు పెట్టలేదు మన రాష్ట్రంలో మాత్రం అందుకు విరుద్ధంగా పాలన ఉంది. దళితుల భూములు దోచుకుంటున్నారు. మనం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు లాక్కున్న భూములను తిరిగి అప్పగిస్తామన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కేసులు పెడుతున్నారని లోకేశ్‌ మండిపడ్డారు. అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు పెట్టి ప్రజలను చైతన్యపరుస్తున్నామన్నారు.

'జిల్లాలో అమరరాజా పరిశ్రమ వెళ్లిపోవడం వల్ల దాదాపు 20 వేల మంది రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. అనంతపురంలో జాకీ పరిశ్రమను కూడా అక్కడ ఎమ్మెల్యే కమీషన్ల కోసం ఒత్తిడి చేసి తరిమేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 10లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. సొంత ప్రయోజనాలు, అవినీతి సొమ్ము కోసం జగన్ రాష్ట్ర ప్రయోజనాలు, యువత భవిష్యత్తును బలి పెట్టారు.'-లోకేశ్‍, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details