ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MLA ROJA: వాలీబాల్​ ఆడి సందడి చేసిన ఎమ్మెల్యే రోజా - ఏపీ 2021 వార్తలు

చిత్తూరు జిల్లాలో చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడోత్సవాలకు.. అనంతరం శ్రీకాళహస్తిలోని మాధురి నెక్లెస్ మేళా కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. అన్ని పురపాలక, నగరపాలక ఎన్నికల్లో వైకాపానే విజయం సాధిస్తుందని తెలిపారు.

nagari-mla-roja-started-volleyball-compettitions
అన్నతో కలిసి వాలీబాల్ ఆడిన ఎమ్మెల్యే రోజా

By

Published : Nov 5, 2021, 11:48 AM IST

Updated : Nov 5, 2021, 1:57 PM IST

కుప్పంతో పాటు అన్ని పురపాలక, నగరపాలక ఎన్నికలలో వైకాపా ఘన విజయం సాధిస్తుందని నగర ఎమ్మెల్యే ఆర్.కె. రోజా అన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని మాధురి నెక్లెస్ మేళా ప్రారంభోత్సవానికి ఆమె హాజరై సందడి చేశారు. గత ఐదేళ్ళ కాలంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారని తెలిపారు. పండగ వేళ ఎన్నికలు ఏంటని చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల నిర్వహణ.. ఎన్నికల సంఘం పరిధిలో ఉంటుందని చంద్రబాబు గ్రహించాలని సూచించారు. ఎన్నికల కమిషనర్​గా నిమ్మగడ్డ రమేష్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడికి అన్నీ నచ్చాయని.. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ ఏం చేసినా తప్పుగా భావించడం మానుకోవాలని ఎమ్మెల్యే రోజా హితవు పలికారు.

అక్కడ అన్నతో వాలీబాల్.. ఇక్కడ మహిళలతో నెక్లెస్ షో..

అంతకు ముందు రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడోత్సవాల్లో రోజా తన సోదరుడు రాం ప్రసాద్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. పుత్తూరు ఎస్.ఆర్.ఎస్. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మండల వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా.. తన సోదరుడు రాం ప్రసాద్ రెడ్డితో కలిసి వాలీబాల్ ఆడి సందడి చేశారు.

Last Updated : Nov 5, 2021, 1:57 PM IST

ABOUT THE AUTHOR

...view details