ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరు జిల్లా కలెక్టర్​తో ఎమ్మెల్యే రోజా సమావేశం - ఎమ్మెల్యే రోజా వార్తలు

నగరి ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి.. వారికి సేవ చేయటానికి ముందుకు వచ్చానని ఎమ్మెల్యే రోజా అన్నారు. జిల్లాలో పరిశ్రమల అనుమతుల గురించి ఎమ్మెల్యే జిల్లా పాలనాధికారితో చర్చించారు.

nagari mla roja meets chittor collector
చిత్తూరు కలెక్టర్​తో ఎమ్మెల్యే రోజా సమావేశం

By

Published : May 11, 2020, 11:38 PM IST

చిత్తూరు జిల్లా నగరి ప్రజల ఇబ్బందులను చూసి వారికి చేయాలని భావించానని ఎమ్మెల్యే రోజా అన్నారు. జిల్లాలో పరిశ్రమల అనుమతులు గురించి జిల్లా పాలనాధికారి భరత్​ గుప్తాతో రోజా చర్చించారు. అన్ని శాఖల సమన్వయంతో జిల్లాలో కరోనా కట్టడి సాధ్యమైందని తెలిపారు.

అంతా సర్దుకుంటుందనుకున్న సమయంలో... చెన్నై కోయంబేడు మార్కెట్​కు వెళ్లినవారికి కరోనా పాజిటివ్ రావడంతో జిల్లా యంత్రాంగం ఉలిక్కిపడిందన్నారు. జిల్లా నుండి ఏయే ప్రాంతాలవారు ఈ మార్కెట్​కు వెళ్లారు... వారు ఎవరా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారన్నారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని రోజా ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:'బకాయిలు ఇప్పించండి.. లేదంటే పోరాటం ఉద్ధృతం'

ABOUT THE AUTHOR

...view details