ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సజ్జల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా - cm jagan latest news

చిత్తూరు జిల్లా పుత్తూరు మార్కెట్ యార్డులో నగరి ఎమ్మెల్యే రోజా.. సజ్జల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ధరల స్థిరీకరణ కోసం వైకాపా సర్కార్ మూడు వేల కోట్ల రూపాయలను కేటాయించిందని రోజా వెల్లడించారు.

సజ్జల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా
సజ్జల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా

By

Published : Sep 24, 2020, 4:16 PM IST

చిత్తూరు జిల్లా పుత్తూరు మార్కెట్ యార్డ్​లో నగరి ఎమ్మెల్యే రోజా సజ్జల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. పంట కొనుగోళ్లకు సంబంధించి ధరల స్థిరీకరణ కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి రూ.3 వేల కోట్లు కేటాయించారని రోజా పేర్కొన్నారు.

కట్టుబడి ఉన్నారు..

ఈ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండిస్తున్న పంటలను కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. బహిరంగ మార్కెట్లో దళారులు రూ.2,150 చెల్లిస్తున్నారని.. ప్రభుత్వం అంతకంటే ఎక్కువే అందిస్తోందని వెల్లడించారు. అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని రోజా పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ కార్యదర్శి గోపి, వైకాపా నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : కొడాలి వ్యాఖ్యలు నిరసిస్తూ భాజపా రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

ABOUT THE AUTHOR

...view details