మెగాబ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక, వెంకట చైతన్యల వివాహానికి పెద్దలు ముహూర్తాన్ని ఖరారు చేశారు. డిసెంబర్ 9వ తేదీ రాత్రి 7 గంటల 15 నిమిషాలకు వివాహ ముహూర్తాన్ని నిశ్చయించినట్లు వరుడి తండ్రి, విశ్రాంత ఐపీఎస్ అధికారి ప్రభాకరరావు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శించుకొని.. వివాహ పత్రికను స్వామివారి చెంత ఉంచి ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం వివాహ వేదికతో పాటు సమయాన్ని ప్రకటించారు. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌విలాస్ వేదికగా పెళ్లి వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రభాకరరావు తెలిపారు.
శ్రీవారి పాదాల చెంత నిహారిక వివాహ పత్రిక - నాగబాబు కుమార్తె వివాహం
కొణిదెల నిహారిక, చైతన్య జొన్నగడ్డల వివాహానికి పెద్దలు తేదీని ఖరారు చేశారు. డిసెంబర్ 9న రాత్రి 7 గంటల 15నిమిషాలకు వివాహ ముహూర్తాన్ని నిశ్చయించినట్లు వరుడి తండ్రి, విశ్రాంత ఐపీఎస్ అధికారి జె.ప్రభాకర్‌రావు తెలిపారు. తిరుమల శ్రీవారి చెంత వివాహ పత్రిక ఉంచి ఆశీర్వచనం తీసుకున్నారు.
శ్రీవారి పాదాల చెంత నిహారిక వివాహ పత్రిక