MURDER: శ్రీకాళహస్తిలో యువకుడి దారుణహత్య..పాత కక్షలేనా..! - శ్రీకాళహస్తిలో రౌడిషీటర్ హత్య
13:16 September 09
సీసీ కెమెరాల్లో దాడి దృశ్యాలు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో రౌడీషీటర్ దారుణహత్యకు గురయ్యాడు. ఇమ్రాన్‌ఖాన్(28)ను మంగళవారం రాత్రి భక్త కన్నప్ప వంతెనపై ప్రత్యర్థులు కిరాతకంగా దాడి చేశారు. రెండు చేతులు విరిగిపోవడంతో పాటు జననాంగాల పైన దాడి జరగడంతో ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యం పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వంతెన సమీపంలో అమర్చిన సీసీ పుటేజీల్లో దాడి దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. ఇమ్రాన్ ఖాన్‌పై పలు కేసులు ఉండడంతో పాత దాడికి పాత కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి:సంగం డెయిరీ న్యాయవాది వేణుగోపాల్ అరెస్టు