చిత్తూరు జిల్లాలో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. చిత్తూరు, తిరుపతి నగరపాలక సంస్థలతో పాటు పలమనేరు, పుత్తూరు, నగరి, మదనపల్లె పురపాలక సంఘాల్లో బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు పోలింగ్ సిబ్బందికి సామగ్రి పంపిణీ చేశారు. ప్రత్యేక భద్రత నడుమ బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించారు.
చిత్తూరు జిల్లాలో పురపాలక ఎన్నికలకు సర్వం సిద్ధం - chithore district latest news
చిత్తూరు జిల్లాలో రేపు పురపాలక, నగరపాలక సంస్థ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఘర్షణలు తలెత్తకుండా పోలీస్ బందోబస్తు చేపట్టారు.
![చిత్తూరు జిల్లాలో పురపాలక ఎన్నికలకు సర్వం సిద్ధం municipal election arrangements completed in chithore district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10936281-749-10936281-1615289883242.jpg)
చిత్తూరు జిల్లాలో పురపాలక ఎన్నికలకు సర్వం సిద్ధం
పుత్తూరు పురపాలకలో బుధవారం నిర్వహించనున్న ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఎన్నికల సిబ్బందికి జిల్లా పురపాలక ఎన్నికల ప్రత్యేక అధికారి జేసీ రాజశేఖర్ పలు సూచనలు చేశారు. ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను పటిష్ఠం చేసినట్లు స్పష్టం చేశారు.