తిరుపతి నగరపాలక కమిషనర్ గిరీషా తిరుపతిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. లాక్డౌన్ అనంతరం పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులతోపాటు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. పాఠశాలలు ప్రారంభం అయ్యేలోపు బోధన, బోధనేతర సిబ్బంది కరోనా పరీక్షలు చేసుకోవాలని ఆదేశించారు.
'పాఠశాలల ప్రారంభానికి ముందే సిబ్బందికి కరోనా పరీక్షలు' - chittoor district latest update
తిరుపతిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో నగరపాలక కమిషనర్ గిరీషా సమీక్ష నిర్వహించారు. కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారికి వివరించారు.
1, 3, 5, 7 తరగతుల పిల్లలకు ఒకరోజు, 2,4,6,8 తరగతుల పిల్లలకు మరుసటి రోజు పాఠాలు బోధించేలా ప్రణాళికలు రూపొందించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. 9,10 తరగతుల పిల్లలు ప్రతిరోజు పాఠశాలకు వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తరగతులు నిర్వహించాలన్నారు. ఒక్కో గదిలో 20 మంది పిల్లలకే అనుమతించాలని... పాఠశాలలోకి ప్రవేశించే సమయంలోనే థర్మల్ స్కానింగ్‌తో విద్యార్థుల శరీర ఉష్ణోగ్రతలు చూడాలని ఆదేశించారు. మాస్కు లేకుండా విద్యార్థులను పాఠశాలలోని అనుమతించవద్దని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి
'నకిలీ పత్రాలతో రూ.50 లక్షలు మాయం'