ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేంద్రం కీలక నిర్ణయం.. ఎంఎస్‌ఎంఈలు ఇకపై 'ఉద్యమ్'!

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల ప్రామాణికాల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఎంఎస్‌ఎంఈలను ఉద్యమ్‌గా అప్‌గ్రేడ్‌ చేసింది.. ఇకపై కొత్తగా పరిశ్రమ స్థాపించాలనుకునేవారు ఉద్యమ్‌ విభాగంలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.. ప్రస్తుతం మనుగడలో ఉన్న పరిశ్రమలన్నీ మరోసారి తప్పక రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. దాంతో పరిశ్రమల యాజమాన్యాలు ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్‌ బాట పట్టాయి. పరిశ్రమల్లో యంత్రాలు, టర్నోవర్‌ విలువల్లో మార్పులు చేసిన కారణంగా.. అనేక పరిశ్రమల స్థాయి మారే అవకాశాలు ఉన్నాయి.

ఎంఎస్‌ఎంఈలు ఇక ఉద్యమ్‌గా.. కొత్త పరిశ్రమల రిజిస్ట్రేషన్ ఇలా...
ఎంఎస్‌ఎంఈలు ఇక ఉద్యమ్‌గా.. కొత్త పరిశ్రమల రిజిస్ట్రేషన్ ఇలా...

By

Published : Jul 20, 2020, 8:18 PM IST

పరిశ్రమల వివరాలు

పరిశ్రమలకు ఇచ్చే రుణాలు, రాయితీలు, ఇతర ప్రయోజనాల కల్పనలో పారదర్శకత కోసం సరికొత్త విధానాన్ని కేంద్రం ప్రవేశ పెట్టింది. ఇందుకు జీఎస్టీ, పాన్‌, ఆధార్‌ నెంబర్లను అప్‌లోడ్‌ చేశాక ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్‌ సంఖ్య కేటాయిస్తారు. అనంతరం.. ఆయా పరిశ్రమలకు చెందిన అన్ని వివరాలను అధికారులు తెలుసుకుంటారు. కొత్తగా పరిశ్రమలు స్థాపించాలనుకునేవారు ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకుని ధ్రువపత్రం పొందాలి.

● జిల్లాలోని ఎంఎస్‌ఎంఈలు: 8 వేలకు పైగా

● ఉపాధి: లక్షమందికి పైగా

● పెట్టుబడి: రూ.27 వేల కోట్లు

● మెగా, భారీ పరిశ్రమలు: 163

● ఉపాధి: 70 వేలమందికి పైగా

● పెట్టుబడి: రూ.20 వేల కోట్లు

వాస్తవ పరిస్థితి నిర్ధారణ

ఉద్యమ్‌ నమోదుతో పరిశ్రమల వాస్తవ పరిస్థితిపై కచ్చితత్వం వస్తుంది. దీని ఆధారంగా వచ్చే రోజుల్లో బ్యాంకులు రుణాలు, ప్రభుత్వ రాయితీల మంజూరుకు వీలుంటుంది. పరిశ్రమలు ఇచ్చే ధ్రువపత్రాలనే ఇప్పటివరకు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇండస్ట్రియల్‌ లైసెన్సు, శాశ్వత రిజిస్ట్రేషన్‌(ప్రొవిజినల్‌/పర్మినెంట్‌), ఎంటర్‌ప్రెన్యూర్‌ మెమోరాండం, పార్ట్‌ (1/పార్ట్‌2), ఉద్యోగ్‌ ఆధార్‌ మెమోరాండం ఇతర ధ్రువపత్రాలను ఆ శాఖ జారీ చేసేది. ఇకపై ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్‌ మాత్రమే అన్నింటికీ మూలం కానుంది.

తప్పక నమోదు కావాలి

జిల్లాలోని పరిశ్రమల వివరాల నమోదు ప్రక్రియ మారింది. ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. ఇప్పటికే ఉన్న పరిశ్రమలు సహా కొత్తగా ఏర్పాటుచేసే పరిశ్రమలకు ఇది వర్తిస్తుంది. పరిశ్రమల టర్నోవర్‌, యంత్ర విలువ ఆధారంగా సామర్థ్యం నిర్ణయిస్తారు. -ప్రతాప్‌రెడ్డి, జీఎం, జిల్లా పరిశ్రమల కేంద్రం, చిత్తూరు

-

ఇదీ చదవండి:

బాలిక అత్యాచార ఘటనపై చంద్రబాబు ఆగ్రహం... దిశచట్టం ఏమైందని ప్రశ్న?

ABOUT THE AUTHOR

...view details