ముంబైలో.. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. దాడి చేసిన దుండగులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం, మండల స్థాయి నాయకులు వెంకటప్ప, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.