చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం సరిహద్దు ప్రాంతం కర్ణాటక పరిధిలోని కలవంచి వద్ద భూమి సర్వే చేస్తున్న తహసీల్దార్ చంద్రమౌళి గురువారం హత్యకు గురయ్యారు. విధి నిర్వహణలో ఉన్న అతన్ని విశ్రాంత ఉపాధ్యాయుడు వెంకటాచలం కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన తహసీల్దార్‌ను సిబ్బంది ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. హత్యకు భూ వివాదం కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
తహసీల్దార్‌ను కత్తితో పొడిచి చంపిన వృద్ధుడు - చిత్తూరు జిల్లా నేర వార్తలు
విధి నిర్వహణలో ఉన్న తహసీల్దార్‌ని కత్తితో పొడిచి చంపాడు ఓ వృద్ధుడు. భూ వివాదం కారణంగానే అతను ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు విశ్రాంత ఉపాధ్యాయుడు కావడం గమనార్హం.
mro brutally killed by retired teacher in karnataka