ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పీలేరులో 18 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిలిపివేత - MPTC elections postponed news in peleru

చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో 18 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ కారణాలతో వాల్మీకిపురం మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలు, కలికిరి మండలంలో ఒకటి, కలకడ మండలంలో ఒకటి, కంభంవారిపల్లి మండలంలో 6 ఎంపీటీసీ స్థానాలను ఎన్నికల నుంచి మినహాస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు.

పీలేరు నియోజకవర్గంలో ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిలిపివేత
పీలేరు నియోజకవర్గంలో ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిలిపివేత

By

Published : Mar 9, 2020, 10:24 PM IST

పీలేరు నియోజకవర్గంలో ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిలిపివేత

చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని వాల్మీకిపురం మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలు ఉండగా... వాటిలో 10 స్థానాలకు ఎన్నికలు నిలిపివేశారు. ఇందులో వాల్మీకిపురం 1,2,3,4 ఎంపీటీసీ స్థానాలతో పాటు చింతపర్తి 1,2 చింతలవారిపల్లి, మంచూరు, నగిరి మడుగు, టి.సాకిరేవుపల్లిలో ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిలిపేశారు. కలికిరి మండలంలో పత్తేగడ, కలకడ మండలంలో కలకడ, కంభంవారిపల్లి మండలంలో తిమ్మాపురం, మారెళ్ల, జిల్లెల్ల మందా, గాలివారిపల్లి, తీతవ గుంటపల్లి, గ్యారంపల్లి స్థానాలకు ఎన్నికలను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా పీలేరు నియోజకవర్గంలో 80 ఎంపీటీసీ స్థానాలకు గాను 62 స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించనున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details