చిత్తూరు జిల్లాలో మూడవ దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. జిల్లాలోని కుప్పం మండలం వెండుగంపల్లె, గోనుగూరు పంచాయతీల్లో ఎన్నికల రోజున చిత్తూరు ఎంపీ రెడ్డప్ప పర్యటించారు. ఆయన పర్యటన పట్ల తెదేపా ఎమ్మెల్సీ గౌని వారి శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో స్థానికేతరుడు ఎలా పర్యటిస్తారని ప్రశ్నించారు. ఈ విషయమై పోలీసులకు ఫోన్లో ఫిర్యాదు చేశారు.
ఎన్నికల రోజున జిల్లాలో ఎంపీ రెడ్డప్ప పర్యటన - ఎన్నికల వేళ చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఎంపీ రెడ్డప్ప
చిత్తూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. జిల్లాలోని పలు గ్రామపంచాయతీల పరిధిలో ఓటర్ స్లిప్పులతో పాటు గుర్తు ముద్రించిన స్లిప్పులను పంపిణీ చేస్తున్న వారిని స్థానికలు అడ్డుకున్నారు. ఎన్నికల రోజున జిల్లాలో ఎంపీ రెడ్డప్ప పర్యటించడాన్ని తెదేపా నేతలు తీవ్రంగా తప్పుబట్టారు.
ఎన్నికల రోజున జిల్లాలో పర్యటించిన ఎంపీ రెడ్డప్ప
కుప్పం నియోజకవర్గంలోని పలు పంచాయతీల పరిధిలో అధికార పార్టీ మద్దతు గల అభ్యర్థులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని తెదేపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. శాంతిపురం మండలం మఠం పంచాయతీలో ఓటరు స్లిప్పులతో పాటు గుర్తును ముద్రించిన స్లిప్పులను పంపిణీ చేస్తున్నవారిని గ్రామస్థులు అడ్డుకున్నారు.
ఇదీ చదవండి:మాడుగుల బ్యాలెట్ పత్రాల్లో తప్పులు..నిలిచిన పోలింగ్