ఇదీ చదవండి:
నిధులు రాబట్టడంలో వైకాపా ఎంపీలు విఫలం: ఎంపీ రామ్మోహన్ నాయుడు - తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడుతో ముఖాముఖి
పార్టీ ఎంపీ చనిపోతే పార్లమెంట్ లో ఏర్పాటు చేసిన సంతాప తీర్మానంలో పాల్గొనని ఘనులు వైకాపా లోక్ సభ సభ్యులని తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలో పర్యటించిన ఆయన తెదేపా అభ్యర్ధి పనబాక లక్ష్మి విజయం తథ్యమని స్పష్టం చేశారు. ప్రచార నిర్వహణ, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఓటర్లకు చేరువ చేయడంలో తెదేపా ముందంజలో ఉందని ఆయన అన్నారు. తిరుపతి అభివృద్దికి, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టడంలో వైకాపా ఎంపీలు విఫలమయ్యారంటున్న రామ్మోహన్‌నాయుడుతో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి.
ఎంపీ రామ్మోహన్ నాయుడు