MP MIDHUN REDDY: తమ ప్రభుత్వానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని... ఐదేళ్లు అధికారంలో ఉంటామని ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీని కాపాడుకునేందుకే చంద్రబాబు నాయుడు తరచుగా ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతున్నారని అన్నారు. తిరుపతిలో రోబో డైనర్ హోటల్ నూతనంగా తయారు చేసిన మొబైల్ యాప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..ప్రేక్షకులకు, థియేటర్ల యాజమాన్యానికి ఇద్దరికీ నష్టం కలగకూడదన్నది ప్రభుత్వ యోచన అని తెలిపారు. సినిమా టికెట్ ధరలపై కమిటీ నిర్ణయం మేరకు నడుచుకుంటామన్నారు. మా కుటుంబంపై ఆరోపణలు చేసిన కొండ్రెడ్డి అనే వ్యక్తిపై చాలా కేసులు ఉన్నాయని.. బస్సు దోపిడీ లాంటి కేసులు కూడా అతనిపై నమోదయ్యాయని తెలిపారు.
MP MIDHUN REDDY:ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన ప్రభుత్వానికి లేదు: ఎంపీ మిథున్ రెడ్డి - MP Midhun Reddy latest news
MP MIDHUN REDDY: తమ ప్రభుత్వానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని ఎంపీ మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. అయిదేళ్లు అధికారంలో ఉంటామని.. పార్టీని కాపాడుకునేందుకు చంద్రబాబు నాయుడు తరచుగా ముందుస్తు ఎన్నికల గురించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
ఎంపీ మిధున్ రెడ్డి