లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి అనవసరంగా రహదారులపై తిరగబోమని... ద్విచక్ర వాహనదారులతో పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. చిత్తూరు జిల్లా కలికిరి పట్టణంలో ఎస్సై రామాంజనేయులు ఈ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో కరోనా బాధితులు సంఖ్య పెరుగుతున్న క్రమంలో పోలీసులు లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
'రోడ్లపై అనవసరంగా తిరగం.. దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాం'
చిత్తూరు జిల్లా కలికిరి పట్టణంలో ఎస్సై రామాంజనేయులు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనవసరంగా రహదారులపై తిరగబోమని... ద్విచక్ర వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు.
'రోడ్లపై అనవసరంగా తిరగం: దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాం'
కానీ కొందరు ఏ పని లేకున్నా రోడ్లపై తిరుగుతున్నారు. అలాంటి వారిని నిలిపి ప్రతిజ్ఞ చేయిస్తున్నారు ఎస్సై రామాంజనేయులు. ''సమాజ శ్రేయస్సుకు భద్రత వహిస్తానని... ఇక మీదట అనవసరంగా రోడ్లపై కనిపిస్తే చట్టపరమైన చర్యలకు తాను అంగీకరిస్తాను'' అంటూ ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. ఎస్సై రామాంజనేయులు చర్యను స్థానికులు అభినందిస్తున్నారు.
ఇదీ చదవండీ... పేద ప్రజలకు కలికిరి పోలీసుల అన్నదానం