Mother and Son died in Road Accident: చిత్తూరు జిల్లా గంగవరం మండలం మామడగు వద్ద జరిగిన ప్రమాదంలో తల్లీకుమారుడు మృతి చెందారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన వెంకట్ కుటుంబం ఉద్యోగరీత్యా బెంగుళూరులో స్థిరపడ్డారు. ఈరోజు తమిళనాడులోని వేలూరులో స్నేహితుడిని కలిసి కుటుంబంతో సహా బెంగుళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో గంగవరం దగ్గర కారు టైరు పంక్చరై.. వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ముందు సీట్లో కూర్చున్న గాయత్రి (30), కుమారుడు విథున్ (3) ప్రాణాలు కోల్పోయారు. తండ్రి, కుమార్తెకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది.
రోడ్డు ప్రమాదంలో తల్లీకుమారుడు మృతి - ap news
Road Accident రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. వేలూరు నుంచి బెంగళూరు వెళ్తున్న కారు టైర్ పంక్చరై ట్రక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడేళ్ల కుమారుడితో పాటు తల్లి ప్రాణాలు విడిచింది. తండ్రి, కుమార్తెకు తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.
road accident
Last Updated : Aug 14, 2022, 5:06 PM IST