రోడ్డుప్రమాదంలో 13 నెలల పసిపాపతో సహా తల్లి మృతి చెందింది. ఈ ఘటన తిరుపతి రూరల్ మండలం ఓటేరు వద్ద జరిగింది.
చంద్రగిరికి చెందిన ముని తేజోవతి (32), తన బిడ్డ కుందన(13 నెలలు)ను తీసుకొని తన తమ్ముడితో బైక్పై అత్తగారి ఊరు నారాయణవనానికి బయలుదేరారు. తిరుపతి గ్రామీణ మండలం ఓటేరు వద్దకు రాగానే ఓ ట్రాక్టర్ వీరి బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తేజోవతి, కుందన మృతి చెందారు. తిరుచానూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రోడ్డు ప్రమాదం: 13 నెలల పసిపాపతో సహా తల్లి మృతి - ఓటేరు వద్ద రోడ్డు ప్రమాదం
తిరుపతి రూరల్ మండలం ఓటేరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పొత్తిళ్లలోని పసికందుతో సహా తల్లి మృతి చెందింది.
![రోడ్డు ప్రమాదం: 13 నెలల పసిపాపతో సహా తల్లి మృతి mother and daughter killed in a road accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5461159-498-5461159-1577036398067.jpg)
రోడ్డు ప్రమాదం
అత్తగారింటికి వెళ్తూ... అనంత లోకాలకు!
ఇదీ చదవండి:ప్రేమజంట ఆత్మహత్యాయత్నం... కారణం ఏంటంటే..!
Last Updated : Dec 23, 2019, 12:01 AM IST