Most wanted gang arrested: దక్షిణ భారతదేశంలోనే మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఎట్టకేలకు చిక్కింది. చిత్తూరు తాలూకా పోలీసులు వీరిని అరెస్టు చేశారు. వీరి నుంచి 55 లక్షల విలువచేసే బంగారు, వెండి ఆభరణాలు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పాన్ బ్రోకర్ షాపులో జరిగిన దొంగతనం కేసు దర్యాప్తులో భాగంగా అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. చిత్తూరులోని పోలీసు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి నిందితులను మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. వీరిలో మోస్ట్ వాంటెడ్ కరుడు గట్టిన అంతర్ రాష్ట్ర దొంగలు మురుగన్ శివగురు అలియాస్ కరాటే మురగ, రాజాలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
15 సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ దొంగల ముఠా అరెస్టు..
Most wanted gang arrested: పదిహేను సంవత్సరాలుగా చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ముఠా ఎట్టకేలకు దొరికింది. నాలుగు రాష్ట్రాల్లో వీరిపై 42 కేసులు ఉన్నాయి. వీరు దేశంలోని వివిధ రాష్ట్రాలలోని బ్యాంకులు, పాన్ బ్రోకర్ షాపులు, నగల షాపులు, ఒంటరి వ్యక్తులు ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు.
తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాల్లో వీరిపై 42 కేసులు నమోదు అయినట్లు వివరించారు. గత 15 సంవత్సరాల నుంచి దక్షిణ భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో బ్యాంకులు, పాన్ బ్రోకర్ షాపులు, నగల షాపులు, ఒంటరి వ్యక్తులు ఉండే ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ ఉండేవారు. పోలీసుల కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్నట్లు వివరించారు. ముఠా సభ్యుల్లో మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. పరారీలో ఉన్న మిగిలిన దొంగలను త్వరలోనే పట్టుకుంటామని ప్రకటించారు.
ఇవీ చదవండి: