ఏపీ,తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.తవనంపల్లె మండలం జెట్టిపల్లెకు చెందిన గల్లా హేమచంద్ర చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలు దొంగతనాలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు.తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాల్లో మరో9చోరీ కేసులు అతడిపై నమోదైయ్యాయి.మొత్తం22కేసుల్లో ముద్దాయిగా ఉన్న హేమచంద్ర కోసం పోలీసులు గాలిస్తున్నారు.ఇవాళ సిద్దంపల్లి క్రాస్ వద్ద తచ్చాడుతున్న నిందితుడిని పోలీసులు మాటు వేసి అరెస్ట్ చేశారు.అతడి నుంచి52గ్రాముల బంగారం, 2ద్విచక్రవాహనాలు,రూ. 4.50లక్షల విలువ గల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ఈశ్వర్ రెడ్డి వెల్లడించారు.
చిత్తూరు పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర దొంగ - most wanted accused thief arrested at chittor dist
ఏపీ, తమిళనాడు, కర్ణాటకల్లో చోరీలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగ చిత్తూరు పోలీసులకు చిక్కాడు. అతని నుంచి బంగారం, 2 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర దొంగ
TAGGED:
ap latest