ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జంట హత్యల కేసులో మరిన్ని విస్తుపోయే విషయాలు! - మదనపల్లె జంట హత్యలు తాజా వార్తలు

జంట హత్యల కేసులో మరిన్ని విస్తుపోయే విషయాలు..
జంట హత్యల కేసులో మరిన్ని విస్తుపోయే విషయాలు..

By

Published : Jan 28, 2021, 1:50 PM IST

Updated : Jan 28, 2021, 6:41 PM IST

13:48 January 28

చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసును పోలీసులు విచారణ చేస్తుంటే.. మరిన్ని విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్తగా మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. అలేఖ్య సోషల్​ మీడియాలో చేసిన పోస్టులు విస్తు గొలుపుతున్నాయి.

జంట హత్యల కేసులో మరిన్ని విస్తుపోయే విషయాలు..

మదనపల్లె జంట హత్యల కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పునర్జన్మలపై విశ్వాసమే హత్యలకు కారణమని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తులో గుర్తించిన వివరాల ప్రకారం... ఈ నెల 22న తన పేరును 'మోహిని'గా మార్చుకుంటూ సోషల్ మీడియాలో అలేఖ్య పోస్టులు పెట్టింది.

తాను ప్రపంచ సన్యాసిని అని పేర్కొంది. తరచూ వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త 'ఓషో' కొటేషన్లు పెర్కొంటూ వస్తోంది. 'ఓషో'ను తన ప్రేమికుడిగా పోస్టులు చేసింది. చావు, పుట్టుకలకు సంబంధించి తరచూ కొటేషన్లను పోస్టు చేసేది అలేఖ్య. జుట్టును కొప్పుగా చుట్టుకుని 'హెయిర్ పిరమిడ్'గా పేర్కొనేది. హెయిర్‌ పిరమిడ్‌ను అయస్కాంత శక్తిగా అభివర్ణించింది.

ఇదీ చదవండి:

జంట హత్యల కేసులో పోలీసుల సమన్వయ లోపం... నిందితుల తరలింపు ఆలస్యం

Last Updated : Jan 28, 2021, 6:41 PM IST

ABOUT THE AUTHOR

...view details