శ్రీలంక టూ తిరుపతి
శ్రీలంక పర్యటనలో ఉన్న మోదీ.. కొలంబో విమానాశ్రయం నుంచి భారత వాయుసేన విమానంలో మూడు గంటలకు బయలుదేరి సాయంత్రం 4:30 గంటలకు నేరుగా తిరుపతి విమానాశ్రయానికి చేరుకోనున్నారు. 4:40 నుంచి 5 గంటలా 10 నిమిషాలవరకు విమానాశ్రయం వద్ద గల కార్బన్ సెల్ కంపెనీ గ్రౌండ్‌లో నిర్వహించే సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. 7 గంటలా 15 నిమిషాల వరకు స్వామివారి సేవలో ఉంటారు. ఆలయం నుంచి తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని.. దిల్లీకి తిరుగుపయనం కానున్నారు.
భారీ భద్రత
రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం... నరేంద్ర మోదీ తొలిసారిగా రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. పర్యటనలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా దిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు, జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. కలెక్టర్ భరత్ గుప్తా ఇప్పటికే జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధాని కాన్వాయిని పరిశీలించారు. ఆలయం వద్ద, కొండపై గల పరిసరాలలో, కనుమ దారును భద్రతా సిబ్బంది జల్లెడ పడుతున్నాయి. 300 మందికి పైగా సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు.