గతంలో ఎన్నడూ లేనివిధంగా... మెుదటిసారి వినాయక చవితి పండుగ నిరాడంబరంగా గృహాలకు పరిమితమైంది. కరోనా మహమ్మారి ప్రభావంతో బొజ్జ గణపయ్య ప్రతిమలు బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడా కనిపించలేదు. వినాయక చవితిని 7 నుంచి 10 రోజుల పాటు ఘనంగా నిర్వహించే వారు.
నిరాడంబరంగా గణనాథుడి నవరాత్రులు - lord ganesh news
కొవిడ్ కారణంగా.. వినాయక చవితి పండుగ ఇళ్లకే పరిమితమైంది. ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే గణేశ్ ఉత్సవాల హడావుడి ఈసారి ఎక్కడా కనిపించలేదు.
నిరాడంబరంగా గణేశ్ ఉత్సవాలు
ఈ ఉత్సవాల్లో గణేష్ యూత్ ముందుండి ఉత్సాహంగా కార్యక్రమాలు నిర్వహించేది. ప్రతి ఊరు, వాడ బొజ్జ గణపయ్య విగ్రహాలు ప్రతిష్టించి... ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించేవారు. తిరుపతిలో వినాయక చవితి ఉత్సవాలు గృహాలకే పరిమితమై బొజ్జ గణపయ్య పూజలు అందుకున్నారు. జిల్లా వ్యాప్తంగానూ అదే పరిస్థితి ఉంది.