చిత్తూరు జిల్లా కలికిరి సీకాం డిగ్రీ కళాశాలలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఇంతకు ముందు ప్రజా ప్రతినిధులు మధ్య జరిగిన అంశాలు, ప్రస్తుతం జరుగుతున్న అంశాలపై విద్యార్థులు చర్చించారు. ప్రతిపక్ష, అధికారపక్ష ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం, పంచ్‌లు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పీలేరు, వాల్మికీపురం, కలికిరి తదితర ప్రాంతాలనుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో వచ్చారు.
కలికిరి కళాశాలలో అధ్యక్షా.. అధ్యక్షా..! - latest news of seicom college events
అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నాయకులు అధికార పార్టీపై ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారు. ఎమ్మెల్యేల మధ్య జరిగే వాదోపవాదాలు వాడీవేడీ చర్చలను కళ్లకు కట్టినట్లు చూపించారు చిత్తూరు జిల్లా కలికిరి సీకాం కళాశాల విద్యార్థులు.
కలికిరి కళాశాలలో జరిగిన మాక్ అసెంబ్లీ