ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తంబళ్లపల్లెలో ఎమ్మెల్యే ఇంటింటి పర్యటన.. - Thamballapalle constituency

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని గ్రామాల్లో ఎమ్మెల్యే ఇంటింటి పర్యటన చేశారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

MLA visits home in villages of Thamballapalle constituency in Chittoor district

By

Published : Aug 5, 2019, 2:53 PM IST

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు మండలం కాలవపల్లె, గూడుపల్లె గ్రామాల్లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఇంటింటి పర్యటన చేశారు. ప్రతి ఇంట్లో సభ్యులతో కొంతసేపు మాట్లాడించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. సిమెంట్ రోడ్లు, మురుగునీటి కాలువలు, గ్రామ ప్రధాన రహదారులు, తాగునీటి సమస్య, పింఛన్లు గురించి ప్రజలు విన్నవించారు. అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న ఈ గ్రామాల్లో ప్రతిచోటా ఎమ్మెల్యేకి ప్రజలు సాదరంగా ఆహ్వానం పలికారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలకు హామీ ఇచ్చారు. గ్రామాలలో పర్యటించి ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని కచ్చితంగా అమలు చేస్తామన్నారు. అన్ని శాఖల అధికారులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

తంబళ్లపల్లెలో ఎమ్మెల్యే ఇంటింటి పర్యటన..

ABOUT THE AUTHOR

...view details