తనకు గ్రూపు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి స్పష్టం చేశారు. తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన 'మన పాలన-మీ సూచన' కార్యక్రమంలో రెండో రోజూ పాల్గొన్న ఆయన... రైతుల సమస్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నారాయణస్వామి... పుత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆర్కే రోజాను పిలవలేదనే ఆరోపణలపై సమాధానమిచ్చారు. పుత్తూరులో ఓ కమ్యూనిటీ హాల్ ఏర్పాటుపై జిల్లా కలెక్టర్‌తో కలిసి అక్కడి స్థలాన్ని అనుకోకుండా పరిశీలించామన్న నారాయణస్వామి... అక్కడ ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించలేదన్నారు. తనకు సోదరి లాంటి రోజాతో విబేధాలను సృష్టించేందుకే ఇలాంటి వివాదాలను రాజేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
'ఎమ్మెల్యే రోజా నాకు సోదరి లాంటిది' - ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి వార్తలు
తనకు సోదరిలాంటి రోజాతో విబేధాలను సృష్టించేందుకే కొందరు ప్రయత్నిస్తున్నారని... ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. పుత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆర్కే రోజాను పిలవలేదనే ఆరోపణలపై ఆయన ఈ సమాధానమిచ్చారు.
dcm narayana swami