ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బుగ్గ అగ్రహారం ప్రభుత్వాసుపత్రికి.. ఎమ్మెల్యే రోజా భర్త సహాయం - రోజా చారిటబుల్ ట్రస్ట్ తాజా సమాచారం

చిత్తూరు జిల్లాలోని బుగ్గ అగ్రహారం ప్రభుత్వాసుపత్రికి ఎమ్మెల్యే రోజా భర్త ఆర్కే సెల్వమణి.. వైద్య పరికరాలు, సామగ్రిని అందజేశారు. రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. నగరి నియోజకవర్గంలో ప్రజలందరూ అప్రమత్తంగా వుండాలని ఆర్.కె.సెల్వమణి కోరారు.

rk selvamani
ఆర్కే సెల్వమణి

By

Published : May 13, 2021, 4:09 PM IST

రోజా చారిటబుల్ ట్రస్ట్ తరుపున ఎమ్మెల్యే రోజా భర్త ఆర్కే సెల్వమణి చిత్తూరు జిల్లాలోని బుగ్గ అగ్రహారం ప్రభుత్వాసుపత్రికి వైద్య పరికరాలు, సామగ్రిని అందజేశారు. నగరి నియోజకవర్గంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి సురక్షితంగా ఉండాలని చెప్పారు.

బుగ్గ అగ్రహారం ప్రభుత్వ ఆసుపత్రికి నెబులైజర్ మెషిన్, పల్స్ ఆక్సీమీటర్, బి.పి.ఆపరేటర్లు,ఎన్95 మాస్కులు,చేతి శానిటైజర్లు తదితర వైద్య,శానిటేషన్ పరికరాలును, స్టేషనరీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డా.రమేష్,మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర ప్రసాద్, ఎంపీడీఓ రామచంద్ర, ఎమ్మార్వో బాబు.. పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details