ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కనిపించని నాలుగో సింహం.. జర్నలిస్ట్: రోజా - mla roja food distribution to poor people at chittoor dst puthoor

చిత్తూరు జిల్లా పుత్తూరులో నగరి ఎమ్మెల్యే రోజా అల్పాహారం పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణకు కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

mla roja wondrafull comments on jounalsits
అన్నార్తులకు ఆహారం పంపిణీ చేసిన ఎమ్మెల్యే రోజా

By

Published : Apr 2, 2020, 5:44 PM IST

అన్నార్తులకు ఆహారం పంపిణీ చేసిన ఎమ్మెల్యే రోజా

చిత్తూరు జిల్లా పుత్తూరులో నిరుపేదలకు ఎమ్మెల్యే రోజా అల్పాహారం అందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరోనా వైరస్ నియంత్రణ కోసం శ్రమిస్తున్నారన్నారు. అలాగే తాము... వైద్య, ఆరోగ్య శాఖల సిబ్బంది, పోలీసులు, మున్సిపల్ శాఖ చిత్తశుద్ధితో పని చేస్తున్నట్టు చెప్పారు. జర్నలిస్టులు కూడా కుటుంబాలను వదిలి కరోనా వైరస్ నియంత్రణకు కృషి చేస్తున్నారని వారి సేవలు కూడా ప్రశంసనీయమని తెలియజేశారు. కనిపించే మూడు సింహాలు పోలీసులు, డాక్టర్లు,మున్సిపల్​ అధికారులయితే కనిపించని నాలుగో సింహమే...జర్నలిస్టు​లని ఆమె పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details