చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజా లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లఘించినట్లు ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పుత్తూరులోని సుందరయ్య కాలనీలో నీటి సౌకర్యం లేకపోవడంతో కొత్తగా బోరు వేశారు. దాన్ని ప్రారంభించేందుకు వచ్చిన రోజాకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. వరుసగా నిలబడి....నడిచి వస్తున్న ఎమ్మెల్యే రోజా కాళ్లపై పూలు చల్లారు. లాక్‌డౌన్ సమయంలో రోజా...ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యే రోజా.. నెటిజన్లు ఫైర్ - లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యే రోజా
చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా వాటర్ బోరు ప్రారంభించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. లాక్‌డౌన్ సమయంలో ప్రారంభోత్సవం చేయడమేంటని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యే రోజా