పేద ప్రజల కోసమే ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు తగ్గించిందని వైకాపా ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ విషయంపై కొందరు కావాలనే అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ప్రభుత్వం చర్చిస్తోందని తెలిపారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో రోజా.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
MLA ROJA AT TIRUMALA: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా - TELUGU NEWS
TIRUMALA NEWS: తిరుమల శ్రీవారిని నగరి ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. సినిమా టికెట్ల వ్యవహారంపై స్పందించిన రోజా.. పేద ప్రజల కోసమే సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా