చెరకు రైతులకు బకాయిల చెల్లింపుల అనంతరమే.. క్రషింగ్ ప్రారంభించాలని ఎమ్మెల్యే రోజా అన్నారు. చక్కెర ఫ్యాక్టరీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. చెరకు రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఉద్యోగుల వేతనాలను చెల్లించడమే కాకుండా వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. చక్కెర ఫ్యాక్టరీ ఎండీ రాంనాథ్, ఛైర్మన్ నందకుమార్, జనరల్ మేనేజర్ కృష్ణ మోహన్, నాయకులు చక్రపాణి రెడ్డి, మనోహర్ నాయుడు, శ్యాంలాల్, భాస్కర్ రెడ్డి, నాగభూషణం రాజు, మురళీనాయుడు తదితరులు పాల్గొన్నారు.
'చెరకు రైతులకు బకాయిల చెల్లింపుల అనంతరం క్రషింగ్ ప్రారంభించాలి' - నిండ్ర నేతం చక్కెర ఫ్యాక్టరీలోని రైతులకు బిల్లుల చెల్లింపు వార్తలు
నిండ్ర నేతం చక్కెర ఫ్యాక్టరీ పరిధిలో రైతులకు చెరకు బకాయిల చెల్లింపుల అనంతరమే చెరకు క్రషింగ్ ప్రారంభించాలని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు.
mla roja on sugar cane farmers