చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం వేపగుంట గ్రామ సర్పంచ్ బాల సుందరం, అతని భార్య వళ్లియమ్మ మృతి పట్ల నగరి ఎమ్మెల్యే రోజా సంతాపం వ్యక్తం చేశారు. బాల సుందరం ప్రజల కోసం ఎంతో శ్రమించారని రోజా అన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలిపించుకున్నారని తెలిపారు. వారి మరణం వైకాపాకు తీరని లోటుగా పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే అన్నారు. కరోనా బారిన పడిన సర్పంచ్ దంపతులు.. చికిత్స పొందుతూ నిన్న మరణించారు.
వేపగుంట గ్రామ సర్పంచ్ దంపతుల మృతికి ఎమ్మెల్యే రోజా సంతాపం - వేపగుంట గ్రామం వార్తలు
చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం వేపగుంట గ్రామ సర్పంచ్ దంపతులు కరోనాతో మరణించారు. వారి మృతి పట్ల నగరి ఎమ్మెల్యే రోజా సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి ఎప్పటికీ అండగా ఉంటామని తెలిపారు.
కరోనాతో మృతి చెందిన దంపతులు
ఇదీ చదవండి:విశాఖ కేజీహెచ్‌లో కరోనా రోగి ఆత్మహత్య