చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం రామకృష్ణాపురం గ్రామ పంచాయతీ సర్పంచి విరింత దేవేంద్రరెడ్డి, ఉపసర్పంచ్ పద్మ, వార్డు సభ్యులు అమ్మణ్ణి, మునిలక్ష్మి, పురుషోత్తం, సూరి, వెంకటేశులు, హేమంత్, బాబు, నాగరాజులను ఎమ్మెల్యే రోజా సన్మానించారు. సప్తగ్రామదేవత పోలాక్షమ్మ ఆలయంలో ఎమ్మెల్యే రోజా విశేష పూజలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు.
సర్పంచి, వార్డుసభ్యులను సన్మానించిన ఎమ్మెల్యే రోజా - ఎమ్మెల్యే రోజా తాజా సమాచారం
చిత్తూరు జిల్లా రామకృష్ణాపురం గ్రామ పంచాయతీ సర్పంచి, వార్డు సభ్యులను నగరి శాసనసభ్యులు రోజా సన్మానించారు. సీఎం జగన్ సంక్షేమ పాలనకు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని వ్యాఖ్యానించారు.
సర్పంచి, వార్డుసభ్యులను సత్కరించిన ఎమ్మెల్యే రోజా