చిత్తూరు జిల్లా కొత్తూరు ఏడీ కె కల్యాణ మండపంలో సంక్రాంతి సందర్బంగా.. 70 మంది రైతులను ఎమ్మెల్యే రోజా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం వచ్చాక రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు పగటిపూట 9 గంటల పాటు విద్యుత్ అందిస్తున్నట్లు వివరించారు. తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు 650 కోట్ల రూపాయలను నెల రోజుల్లోనే రైతు ఖాతాలో జమ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారని ఆరోపించారు.
రైతులను సన్మానించిన ఎమ్మెల్యే రోజా - mla roja update news
సంక్రాంతి సందర్భంగా చిత్తూరు జల్లా కొత్తూరులో.. ఎమ్మెల్యే రోజా రైతులను సన్మానించారు. రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని అన్నారు.
రైతులను సన్మానించిన ఎమ్మెల్యే రోజా