ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కల్లూరువాగు మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే రోజా సాయం - కల్లూరు దళితవాడలో వాగులో గల్లంతై మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే రోజా

చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం కల్లూరు దళితవాడలో.. వాగులో మృతిచెందిన కుటుంబాలను ఎమ్మెల్యే రోజా పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున.. రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించనున్నట్లు తెలిపారు.

mla roja help to kalluru stream victims
మృతుల కుటుంబాలను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే రోజా

By

Published : Dec 8, 2020, 7:36 PM IST

నీటివాగులో గల్లంతై మృతిచెందిన మూడు కుటుంబాలకు.. లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ప్రకటించారు. చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం కల్లూరు దళితవాడలో మృతుల కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు.

రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యశోద, గంగయ్య, సుజాత కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున సాయం చేయనున్నట్లు ఎమ్మెల్యే రోజా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు, ట్రస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details