చిత్తూరు జిల్లా పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పుత్తూరు మున్సిపాలిటీలోని వార్డు వాలంటీర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి నగరి ఎమ్మెల్యే రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు వాలంటీర్లు అనుసంధాన కర్తలుగా వ్యవహరించి.. అటు ప్రభుత్వం, ఇటు ప్రజలకు మంచి చేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల కార్యక్రమాన్ని ప్రజల చేర్చాల్సిన బాధ్యత వారిపై ఉందని అన్నారు. ఎలాంటి సమస్యలున్నా... తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని పేర్కొన్నారు. ఈ సమావేశానికి మున్సిపల్ కమిషనర్ నాగేంద్రప్రసాద్, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, వాలంటీర్లు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
'ప్రభుత్వం, ప్రజలకు వాలంటీర్లు అనుసంధానకర్తలు' - roja
చిత్తూరు జిల్లా పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వార్డు వాలంటీర్లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి ఎమ్మెల్యే రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఎలాంటి సమస్య తలెత్తిన అధికారులను అడగండి