చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో త్వరలో తాగు,సాగునీటి సమస్య తీరబోతోందని.. ఎమ్మెల్యే రోజా అన్నారు. 8 చెరువుల అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. జేఐసీఏ(జపాన్ ఇంటిగ్రేటెడ్ కార్పొరేషన్ ఏజెన్సీ) ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతాయని తెలిపారు. చెరువుల్లో పూడికలు తీయడం, కబ్జాకు గురైన వాటిని గుర్తించి వాటిని అభివృద్ధి చేయడం వంటి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
కుశ స్థలి నది నుంచి నీటిని చెరువులకు పంపే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వీటి ద్వారా 47వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు.